Sunday, January 18, 2009

నవ్వింది నా చెలి

వెండి మబ్బుల్లో
నిండు చందమామలా
చలి కాలంలో సూర్యుని
వెచ్చదనంలా
తెల్లని లిల్లి పూల
గుబాళింపు
చక్కని సాయంత్రం విరిసిన
హరివిల్లు
చీకటి సమయంలో చుక్కల
మిణుకు
సెలయేరులో పారే
మంచి నీరు
గుండెకు హాయినిచ్చే
చల్ల గాలి
వర్షం కురిసే వేళ
పులకరింపు
పచ్చని చిలకల
పలకరింపు
రాగయుక్తంగా సాగే
మంత్రోచ్చారణ
పండగ వేళలో మేళవించే
సంతోషం అనురాగం
గాత్ర సంగీతాల్లో
రాగం
సంక్రాంతి ముగ్గులో
రంగు
ఉరికే జింకలలో
ఉత్సాహం
చినుకు తాకిన చెట్టులో
పచ్చదనం
నెమలి పించంలో
మెరుగు
ఏకాంత వేళలో
గుండె చప్పుడు
అలసిన కనులకు
హాయినిచ్చే ఆకాశం
నీటి చుక్కగా రాలిన
స్వాతి ముత్యం
గిర్రున తిరిగే
విష్ణు చక్రం
దేవుడికి చేసే
అభిషేకం
వసంత కోకిల
కూ హూ రావం
చిలికిన మజ్జిగలో
నవనీతం
మంచి పుస్తకం లో
జ్ఞానం
ధ్యానం లో పొందే
ప్రశాంతం
తలపై శతగోపంతో
ఆశీర్వాదం
చిన్న పిల్లల
అమాయకత్వం
పెద్ద పిల్లల
చిలిపితనం ... . .లా
అలా, ఇలా ....
ఏదోలా ....
అందం కంటే అందమైన
అందంగా, ఆనందంగా
నవ్వింది నా చెలి
నవ్వింది నా చెలి
నవ్వింది నా చెలి
నవ్వింది నా చెలి

No comments: