నేను
డాబా పైకి వచ్చానా
సాంగ్స్ వినటానికి
ఎప్పటిలా ఆకాశం వైపు చూసానా
ఒక చుక్క నాకు కన్ను కొట్టింది
నిజం, అమ్మ తోడు
నేను పడతానా
తిట్టేశాను
నా మనసంత నువ్వే నిండి ఉంటే చుక్కలకు పడతానా
ఆ చుక్కను తిట్టేశాను
ఎలా అంటే ....
" ఏయ్ పిచ్చి చుక్క
ఏంటి మెరుస్తున్నావని పొగరా
ఓహో, నా ప్రియురాలిని నువ్వు చూడలేదు కదా
చూసి ఉంటే, సిగ్గుతో రాలిపోయే దానివి
అలా వేల్లాడుతూ ఉండడం తప్ప
ఎం చేయ్యగలవని, పొగరు నీకు
నా ప్రియురాలిలా నవ్వగలవా
నడువగలవా, నన్ను మురిపించగలవా
చుక్కా, నీ అక్క చెల్లెళ్ళు, నీ అమ్మా అత్తలు
అంతా కలిసి కూడా
నా ప్రియురాలి హొయలు ఒలికించలేరు
సిగ్గు కురిపించలేరు, నన్ను మరిపించలేరు
ఏయ్ చుక్క, పోయే నీ యవ్వ
రాతిరైతే గాని నీ ముఖం కి దిక్కు లేదు
నా ప్రియురాలు పట్టపగలు కూడా వెలుగుతుంది, తెలుసా
సూర్యుడికి 'చెక్-మేట్' పెట్టినట్టు "
ఈ కవిత్వం, ఎలా ఉంది అని కాదు నా ప్రశ్న
.... నాకు అలా అనిపించింది
పాపం చుక్క
నా ఈ ఫీలింగ్ తెలిస్తే
నిజంగా రాలిపోతుందేమో
దానికి చెప్పొద్దూ
సరేనా ...
ము ము ము ము
ముద్దంటే చేదా
నీకా ఉద్దేశం లేదా
ఎపుడు ఇస్తావే ..
Tuesday, January 20, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment